
Ap Liquor Shops Timing: న్యూఇయర్ కు ఒక రోజు మాత్రమే ఉంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పాత ఏడాదికి రేపు చివరి రోజు కావడంతో మద్యం ఏరులై పారనుంది. కొత్త సంవత్సరం సంతోషంతో హంగామా చేయనున్నారు. ఇక న్యూ ఇయర్ సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మందు బాబుకుల బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. మద్యం షాపుల సమయాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల సమయాన్ని పొడిగిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మద్యం ప్రియులకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. యథావిధిగా మద్యం అమ్మకాల వేళలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 31న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, కరోనా వైరస్ సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణుల హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు అన్ని రకాల వేడుకలు రద్దు చేసేసింది. డిసెంబర్ 31, జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరపరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్నాయి. కాగా, ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తగ్గకముందే మరో కొత్త వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ స్ట్రైయిన్ వైరస్ కారణంగా పలు రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నాయి.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపు అర్ధరాత్రి వరకు క్లబ్‌లు, బార్లకు అనుమతి.!