AP ECET 2023 Results Today: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2023 ఫలితాలు ఉన్నత విద్యామండలి ఆదివారం (జులై 2) సాయంత్రం విడుదలచేయనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష జూన్ 20న జేఎన్టీయూ కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 38 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్షర్ కీ జూన్ 23న విడుదలైంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేస్తున్నారు.
ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. కాగా జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (అనంతపూర్) పరిధిలో ఈసెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.