AP Corona Cases: ఏపీ తగ్గుతోన్న కరోనా వ్యాప్తి… గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,151 పాజిటివ్ కేసులు..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,151 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

AP Corona Cases: ఏపీ తగ్గుతోన్న కరోనా వ్యాప్తి… గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,151 పాజిటివ్ కేసులు..
Coronavirus Cases In AP

Updated on: Jun 17, 2021 | 5:45 PM

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,151 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,32,902కి చేరింది. ఇందులో 69,831 యాక్టివ్ కేసులు ఉండగా.. 17,50,904 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అటు నిన్న వైరస్ కారణంగా 58 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 12,167కు చేరుకుంది. ఇక నిన్న 7,728 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 2,08,39,147 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 359, చిత్తూరు 937, తూర్పుగోదావరి 1244, గుంటూరు 331, కడప 478, కృష్ణా 424, కర్నూలు 203, నెల్లూరు 274, ప్రకాశం 554, శ్రీకాకుళం 264, విశాఖపట్నం 237, విజయనగరం 199, పశ్చిమ గోదావరి 647 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!

Loading...
Unable to load recommendations.
Follow Us