నేడు విశాఖకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్, సీఎం జగన్‌

విశాఖపట్నం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖ నగరానికి రానున్నారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రాజ్‌నాథ్‌ విశాఖలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న కేంద్రమంత్రి తూర్పు నౌకాదళాన్ని సందర్శిస్తారు. అనంతరం జరిగే ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో సమావేశం కోసం గురువారం హైదరాబాద్‌ వెళ్లిన జగన్‌ […]

నేడు విశాఖకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్, సీఎం జగన్‌

Updated on: Jun 29, 2019 | 5:58 AM

విశాఖపట్నం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖ నగరానికి రానున్నారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా రాజ్‌నాథ్‌ విశాఖలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న కేంద్రమంత్రి తూర్పు నౌకాదళాన్ని సందర్శిస్తారు. అనంతరం జరిగే ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో సమావేశం కోసం గురువారం హైదరాబాద్‌ వెళ్లిన జగన్‌ శనివారం అక్కడినుంచే రాత్రి ఏడుగంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.