YSR Awards: వైఎస్సార్‌ హయాంలో విశేష అభివృద్ధి.. వేడుకగా ‘వైఎస్సార్’ అవార్డుల ప్రదానోత్సవం..

|

Nov 01, 2023 | 5:28 PM

YSR Awards 2023: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులను అందజేసింది. నవంబర్‌ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై..

YSR Awards: వైఎస్సార్‌ హయాంలో విశేష అభివృద్ధి.. వేడుకగా ‘వైఎస్సార్’ అవార్డుల ప్రదానోత్సవం..
Ys Jagan
Follow us on

YSR Awards 2023: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులను అందజేసింది. నవంబర్‌ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై.. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలను అందజేశారు. గవర్నర్‌, సీఎం జగన్‌ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది అవార్డులను స్వీకరించారు. వీటిలో 23 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 4 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ఉన్నాయి.

ఈ సందర్భంగా సీఎం జగన్.. మాట్లాడుతూ మూడేళ్లుగా వైఎస్సార్‌ అవార్డులు అందించే సాంప్రదాయం కొనసాగుతోందని.. ఇకముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్‌ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. వైఎస్సార్‌ హయాంలో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని తెలిపారు.

అవార్డుల ప్రదానోత్సవం వీడియో చూడండి..

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ సాయం అందుతోందని.. అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి.. అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఏపీ 7వ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిలో మందుకు సాగుతోందని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..