
ఆక్వా రైతుకు శుభవార్త.. యూనిట్‌కు రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీని మరో 12 వేల 680 కనెక్షన్లకు పెంచుతున్నాం. ఇప్పటికే 50 వేల కనెక్షన్లకు ఇస్తున్న సబ్సిడీకి ఇది అదనం.. ఈ వారం మొదట్లో ఏపీ సర్కార్ వేసిన దండోరా ఇది. ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వ్యవస్థల్ని బలోపేతం చేస్తామని కూడా సీఎం మాటిచ్చారు. రాష్ట్రంలో సాగయ్యే 4 లక్షల ఎకరాల ఆక్వా భూముల్ని పూర్తిస్థాయిలో ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్లానింగ్ కూడా జరుగుతోంది. దిగాలుపడ్డ ఆక్వా రంగాన్ని జాకీలు పెట్టి లేపడానికి ఇలా నాన్‌స్టాప్‌గా ప్రయత్నిస్తూనే ఉంది ప్రభుత్వం. కానీ, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. లోపలున్న లొటారం సంగతేంటి? గతంలో ఎప్పుడూ లేనంతగా ఆక్వా రంగం అట్టర్‌ఫ్లాప్ కావడానికి అసలు కారణాలేంటి? ”100 కౌంట్ 215 రూపాయలకు అమ్మితే టన్ను రొయ్యకు 35 వేలకుపైగా నష్టం వస్తోంది. సమ్మర్‌లో రొయ్యల సాగు పెరిగింది కానీ, దాంతోపాటు నష్టాలూ పెరిగాయి. ఉత్పత్తి ఎక్కువై ట్రేడర్స్ రేట్లు తగ్గిస్తున్నారు. పంట ఖర్చులకైనా పైసలు రాకపోతే సాగు చేసేదెలా?” సగటు ఆక్వా రైతు వేదన ఇది. అయ్యో రొయ్య.. ఈ రోదన వినబట్టి ఎన్నో ఏళ్లవుతోంది. ఏపీలో స్వర్గధామం అనుకున్న ఆక్వారంగం...