Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వారం రోజుల పాటు వర్షాలు!

వర్షాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు అదిరిపోయే శుభవార్త చెప్పాయి. బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వారం పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. కాబట్టి ఏ స్టేట్‌లో వర్షాలు ఏలా ఉండబోతున్నాయో చూద్దాం.

Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వారం రోజుల పాటు వర్షాలు!
Latest Weather Report For Ap And Telangana

Updated on: Aug 10, 2026 | 10:30 AM

తెలుగురాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ మరోసారి కీలక సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పబోతున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆవర్తణంగా ఉన్న ద్రోణి.. ఆగస్ట్ 13నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు శనివారం వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా చేసింది.

ఏపీలో వాతావరణం ఇలా

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం: బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తణం మార్చు పదమూడు నాటికి ఉత్తర బంగాళాఖాతాన్ని అనుకున్న ఉన్న పశ్చిమబెంగాల్ తీరంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణకోస్తాంధ్ర ప్రాంతాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు వారం రోజుల పాటు కురిసే అవకాశం ఉందని.. వర్షాల సమయంలో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతవారణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాలో సోమవారం వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచేఅవకాశం ఉందని.. ఈ వర్షాలు ఆగస్ట్ 15 వరకు కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రజలకు అధికారుల సూచనలు

ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అధికారులు కీలక సూచనలు చేశారు. వర్షాల సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని.. డ్రైవింగ్ చేసేటప్పుడు వాహన వేగాన్ని తగ్గించాలని.. నిల్వ ఉన్న నీటిలోకి దిగకూడదు, రహదారులపై తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు, తీగల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us