CM YS Jagan: ముస్లింల రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి వ్యక్తి సన్మార్గంలో నడస్తూ పరిశుద్ధమైన జీవనం కొనసాగించాలన్నదే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని మతపెద్దలు చెబుతుంటారు. ఇలాంటి పవిత్రమైన జీవినాన్ని కొనసాగించాలంటే భగవంతుడిపై విశ్వాసం కలిగి ఉండాలని, దీంతో ప్రతీ రోజూ నమాజ్ చేయవలసి ఉందని చెప్పబడింది. నిరంతరం అధ్యాత్మిక జీవనం కొనసాగించాగించేందుకు తగిన ప్రేరణ ఎంతో అవసరమని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. మనలో ఆధ్యాత్మిక చింతన అలవర్చేందుకు సంవత్సరానికోసారి రంజాన్ మాసంలో కఠిన నియమ నిబంధనలతో కూడిన ఉపవాసదీక్షను పాటిస్తారు. ఈ ఉపవాస దీక్షలలో ముస్లింలకు ప్రముఖులు, రాజకీయ నేతలు ఇఫ్తార్ విందు (Iftar Vindu)ఇస్తుంటారు.
ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Cm YS Jagan) కీలక ప్రకటన చేశారు. ఈనెల 26వ తేదీన ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ మేరకు అధికారులు విజయవాడ ఇందీరాగాంధీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విందుకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాట్లను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరిశీలించారు. ప్రభుత్వ ఇచ్చే ఇఫ్తార్ విందుకు ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున హాజరు కావాలని అంజాద్ బాషా తెలిపారు. అయితే ఈ ఇఫ్తార్ విందుకు సుమారు ఐదు వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: