Andhra Rains: ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు వర్షసూచన.. వాతావరణశాఖ వెదర్ అప్డేట్ ఇదిగో..

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో వానలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు వెదర్ బులిటెన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ, ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమకు వర్షసూచన జారీ చేసింది.

Andhra Rains: ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు వర్షసూచన.. వాతావరణశాఖ వెదర్ అప్డేట్ ఇదిగో..
Rains Ap

Updated on: Jul 15, 2026 | 1:30 PM

వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలు ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. రాబోయే 2 రోజుల్లో ఇది బలమైన అల్పపీడన ప్రాంతంగా మారి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఇక సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జమ్మూ, డెహ్రాడూన్, షాజహాన్‌పూర్, బస్తీ, పాట్నా, బంకురా, వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతంపై విస్తరించి ఉంది.

అటు ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో రాబోయే మూడ్రోజుల పాటు అమరావతి వాతావరణ కేంద్రం వర్షసూచన జారీ చేసింది.  ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజులు  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో కూడా రానున్న మూడ్రోజుల్లో వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్‌నివో ప్రభావం వల్ల ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్‌నివో ఎఫెక్ట్ వల్ల వర్షాలు పెద్దగా పడటం లేదు. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us