Andhra Pradesh: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన పెళ్లి బృందం వ్యాన్.. నలుగురు మృతి..

Andhra Pradesh: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగర్‌ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది.

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన పెళ్లి బృందం వ్యాన్.. నలుగురు మృతి..
Accident

Updated on: May 26, 2022 | 2:39 PM

Andhra Pradesh: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగర్‌ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమ మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారు చల్లపల్లి మండలం చింతలమడకకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 15 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలాఉండగా.. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మదనపల్లి-పుంగనూరు చిత్తూరు రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం అతివేగంతో వెళ్తోన్న కారు కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మృతుల్లో భార్య భర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో రెడ్డివారిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులు గంగిరెడ్డి, మధులత, కుషితారెడ్డి, దేవాన్ష్‌రెడ్డి గా గుర్తించారు. పలమనేరులో పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.