AIDS Day 2024: హెచ్ఐవీ రోగుల సంఖ్యలో నెం.2 స్థానంలో ఏపీ.. అగ్రస్థానంలో ఆ రాష్ట్రం..!

దేశంలో HIV రోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 నాటికి 2,22,338 మంది హెచ్‌ఐవీ రోగులు 'నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ కంట్రోల్‌ ప్రోగ్రాం' కింద చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బాధితుల్లో మహిళల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉంది.

AIDS Day 2024: హెచ్ఐవీ రోగుల సంఖ్యలో నెం.2 స్థానంలో ఏపీ.. అగ్రస్థానంలో ఆ రాష్ట్రం..!
HIV
Follow us
Eswar Chennupalli

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 01, 2024 | 7:14 PM

దేశంలో HIV రోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 నాటికి 2,22,338 మంది హెచ్‌ఐవీ రోగులు ‘నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ కంట్రోల్‌ ప్రోగ్రాం’ కింద చికిత్స పొందుతున్నట్లు డిసెంబర్ 1న ఎయిడ్స్ డే‌ను జరుపుకుంటున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. బాధితుల్లో మహిళల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉంది. మొత్తం 1,22,124 మంది మహిళలు హెచ్‌ఐవీ చికిత్స పొందుతున్నారు. పురుషులు 99,455 మంది, థర్డ్‌జెండర్లు 759 మంది HIVకి చికిత్స పొందుతున్నారు.

దేశంలో అత్యధిక హెచ్ఐవీ రోగుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలుస్తోంది. ఏపీ కంటే ఎక్కువగా మహారాష్ట్రలో మొత్తం 2,39,797 మంది హెచ్ఐవీ రోగులున్నారు. కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16.88 లక్షల మంది హెచ్ఐవీ రోగులు ఈ పథకం కింద చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో హెచ్ఐవీ రోగుల సంఖ్య 1,03,933గా ఉంది.

ఏపీలో 2019-20లో నమోదైన హెచ్‌ఐవీ రోగుల సంఖ్య 1,92,693 కాగా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 2,22,338కు పెరిగింది. అంటే రోగుల సంఖ్య 15.38% పెరిగింది. వీరిలో 90% మంది 15-49 సంవత్సరాలు మధ్య వయస్సు వారే. దాదాపు 90% మందికి సురక్షితంకాని లైంగిక సంబంధాల కారణంగానే హెచ్‌ఐవీ సోకుతున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు. తూర్పు గోదావరి ,కృష్ణ, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కోసం విస్తృత చర్యలు చేపట్టింది. సెక్స్‌ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, సూదుల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకునే వ్యక్తులు, వలస కార్మికులకు హెచ్‌ఐవీ సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నందున, వారిలో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది.

గోప్యంగా బాధితుల వివరాలు

దాదాపు 2 లక్షల మంది ఈ సేవలు అందుకుంటున్నారు. మన రాష్ట్రంలో మొత్తం 2,181 హెచ్ఐవీ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. దాదాపు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా హెచ్‌ఐవీ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. హెచ్‌ఐవీ సోకిందని తెలియగానే ఏఆర్‌టీ చికిత్స మొదలు పెడుతున్నారు. హెచ్‌ఐవీ రోగులకు అవసరమైన మందులను 60 ఏఆర్‌టీ కేంద్రాలు, 161 లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. బాధితుల ఆర్థిక సంక్షేమం కోసం ప్రభుత్వం పింఛను కూడా ఇస్తోంది. హెచ్‌ఐవీ రోగుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు కాబట్టి, అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా నిర్భయంగా పరీక్షలు చేయించుకోవచ్చు.

ఆర్థిక సహాయం కూడా

హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థిక సాయం కోసం ఏఆర్‌టీ పింఛను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఏఆర్‌టీ, లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా మందులు, పరీక్షలు, సలహాలు అందిస్తున్నారు. హెచ్‌ఐవీ బాధితులకు సామాజిక చికిత్స అందించడానికి కౌన్సెలింగ్ సెషన్‌లు నిర్వహిస్తున్నారు. హెచ్‌ఐవీ బాధితులకు హెపటైటిస్‌ వ్యాక్సిన్ ఇస్తున్నారు.

ట్రాన్స్‌జెండర్‌లకు వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందించడానికి ప్రత్యేక కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లో సుఖవ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 ప్రత్యేక సురక్ష క్లినిక్‌లను అందుబాటులో ఉంచింది. ప్రజలకు సురక్షితమైన రక్తం సరఫరా చేయడానికి 227 బ్లడ్‌ బ్యాంక్‌లు, 156 రక్త నిధి కేంద్రాల్ని నెల‌కొల్పింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ గురించి అవగాహన పెంచడానికి విస్తృతమైన కార్యక్రమాల్ని ఎపిశాక్స్ నిర్వ‌హిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా హెచ్‌ఐవీ బాధితులకు సకాలంలో వైద్యం అందుతోంది. ప్రజల్లో హెచ్‌ఐవీ గురించి అవగాహన పెరిగింది. హెచ్‌ఐవీ బాధితులపై సామాజిక వివక్ష తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (APSACS), ‘ప్రపంచ ఎయిడ్స్‌ దినం’ సందర్భంగా విజయవాడలో ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనుంది. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి నవంబరు 12 వరకు “మీకు తెలుసా?” పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ప్రతి ఒక్క ప్రభుత్వ విభాగాన్ని ఇందులో భాగస్వామ్యం చేశారు. పట్టణాలు, గ్రామాల్లో, ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా, యువత స్థాయి నుంచే హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. దీంతోపాటు, నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఏసీవో) మద్దతుతో, ఏపీఎస్‌ఏసీఎస్‌ “యూత్‌ఫెస్ట్‌ 2024-2025” మారథాన్‌ కూడా నిర్వహించింది. స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్‌జెండర్‌లను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్యవంతం చేశారు. లింగ సమానత్వాన్ని చాటేలా, ఈ మూడు విభాగాల్లోనూ ప్రథమ, ద్వితీయ బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయిలో విజేతలను జాతీయ స్థాయి మారథాన్‌కు ఎంపిక చేశారు. 9, 11 తరగతుల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు కూడా నిర్వహించారు.

చాలామంది ప్రజలు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ఒకటే అనుకుంటున్నారు. అది నిజం కాదు. హెచ్‌ఐవీ అంటే “హ్యూమన్ ఇమ్యునో డెఫిసియన్సీ వైరస్‌”. ఈ సూక్ష్మక్రిమి మానవ శరీరంలో ప్రవేశించి, శరీరంలోనే వృద్ధి చెంది, రోగ నిరోధక శక్తిని క్రమేణా నాశనం చేస్తుంది. ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం క్రమంగా క్షీణించి అనేక వ్యాధుల బారిన పడతారు. ఎయిడ్స్ (AIDS) అంటే, “అక్వైర్డ్‌ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్‌”. హెచ్‌ఐవీ మానవ శరీరంలో వృద్ధి చెందాక, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఏర్పడే అనారోగ్య పరిస్థితి ఇది. హెచ్‌ఐవీ ఉన్న అందరూ ఎయిడ్స్‌ రోగులు కాదు. హెచ్‌ఐవీ నుంచి ఎయిడ్స్‌ దశలోకి మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. హెచ్‌ఐవీ సోకినప్పటికీ, బలవర్ధకరమైన ఆహారం, క్రమం తప్పని చికిత్స, వ్యాయామాలతో చాలా ఏళ్లపాటు సాధారణ ప్రజల్లాగే ఆరోగ్యంగా జీవించవచ్చు.

వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం