
అతిశయం కాకపోయినా కచ్చితంగా ఇది ఆసక్తికరమే. పెద్దగా షాకింగ్ ఇవ్వకపోయినా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇది బిగ్ బ్రేకింగే. స్థానిక పోరులో ఫస్ట్ కిక్ కొట్టి దాదాపు 80 శాతం పుర ఓటును క్యాప్చర్ చేసి, వైసీపీని మళ్లీ మైనారిటీలోకి తోసింది కూటమి. ఓటమిని అంగీకరించడం, జీర్ణించుకోవడం మాట అటుంచితే, ఫలితం తిరగబడుతుందని ముందే ఊహించి మానసికంగా సిద్ధమైన వైసీపీ.. పోస్ట్‌మార్టమ్ అవసరం లేకుండా చేసుకుంది. ఓటమికి కారణాలు ఫలానా అని లిస్టవుట్ చేసుకోకపోయినా, వై దిస్ డిబాకిల్ అని వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరాన్నయితే గ్రహించింది అపోజిషన్ పార్టీ. ఆశించినన్ని విజయాల్ని ఖాతాలో వేసుకున్న కూటమిలో మాత్రం జోష్ పెరిగిందనే చెప్పొచ్చు. కానీ, ఈ థంపింగ్ విక్టరీ వెనుక కూటమిలోపల భీకరమైన కసరత్తే జరిగింది. క్యాడర్‌ని దారికి తెచ్చి, ఒక లైన్లో నిలబెట్టడానికి మూడు పార్టీలూ పడిన శ్రమను కూడా రీకాల్ చేసుకోవాల్సిందే. చెప్పాం చేస్తున్నాం.. అని అప్పుడే ఢంకా బజాయించారు కూటమి పెద్ద చంద్రబాబు. స్థానికపోరులో వార్ వన్‌సైడే అని, అది కూడా కూటమి సైడేనని గట్టిగానే ఊహించారు. తమకు కలిసొచ్చిన డబులింజన్ సర్కార్ స్లోగన్‌ని త్రిపుల్ ఇంజన్ సర్కార్‌గా మార్చుకుని, లోకల్ ఓటు కోసం కొత్తగా ఫోకస్ పెట్టిన కూటమికి ఆశించిన...