Ambati Rambabu: అదే సత్తెనపల్లి.. అదే అంబటి.. అదే భోగి.. దాదాపుగా కాస్ట్యూమ్ కూడా అదే. కొరియోగ్రఫీ మాత్రం అప్‌డేట్ ఐంది. కొత్త పాటలకు కొత్తకొత్త స్టెప్స్ వేసి.. అప్‌గ్రేడ్ అయ్యారు మంత్రి అంబటి.
ఆయన మైకు తీసుకుంటే అవతలివాళ్లకు చెమటలే. ప్రెస్‌మీట్లలో పొలిటికల్ స్టేట్మెంట్లతో అదరగటొట్టడం ఆయన మేనరిజం. పండగొస్తే మాత్రం అవతారం పూర్తిగా మారిపోతుంది. గత ఏడాది సత్తెనపల్లి చౌరస్తాల్లో భోగిమంటలేసి.. అంబటి చూపిన వీర పెర్ఫామెన్సులు ఆ తర్వాత టాక్ ఆఫ్‌ది ఏపీ అయ్యాయి. పవన్‌కల్యాణ్ సినిమాకు కమర్షియల్ వ్యాల్యూగా కూడా మారింది. కట్ చేస్తే.. ఈసారి భోగి.
పవన్ మాట.. అంబటి ఆట. తన డ్యాన్సుకి పేరడీ చేసి సినిమాలో వాడుకున్నారంటూ పవన్ మీద ఆరోపణలు చేసిన అంబటి ఈ భోగి సందర్భంగా పవన్ డైలాగ్‌ని, తన సొంత పాటకి లింక్ చేసి.. తనదైన స్టెప్పులతో మళ్లీ అదరగొట్టారు.
ఔను.. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇకనుంచి అందరి చూపూ అంబటి మీదే. ఆ రేంజ్‌లో వచ్చింది ఆయన డ్యాన్సుకి హైప్. ఇదేందయ్యా ఇది నేనేడా జూడ్లా అంటే.. ఔను.. నేను సంబరాల రాంబాబునే.. ఐతే ఏంటి అని కౌంటరేస్తారాయన.