AP Judges issue: జడ్జిలను దూషించిన కేసులో హైకోర్ట్‌ విచారణ.. మరోసారి నోటీసులు జారీకి ఆదేశం

|

Dec 06, 2023 | 11:09 AM

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో న్యాయమూర్తులను దూషించిన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటుంది హైకోర్డ్. ఈ క్రమంలోనే మరి కొందరికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

AP Judges issue: జడ్జిలను దూషించిన కేసులో హైకోర్ట్‌ విచారణ.. మరోసారి నోటీసులు జారీకి ఆదేశం
Ap High Court
Follow us on

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో న్యాయమూర్తులను దూషించిన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటుంది హైకోర్డ్. ఈ క్రమంలోనే మరి కొందరికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు అరెస్ట్ తరువాత న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్‌లోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే 26 మందిని గుర్తించి నోటీసులు పంపారు. గుర్తించిన మరి కొందరికి నోటీసులు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఈ కేసులో టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్నతో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ కు నోటీసులు పంపారు. జడ్జీలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్లు, వ్యక్తిగత దూషణలకు దిగిన వారిలో మరి కొందరిని గుర్తించామని వారికి త్వరలో నోటీసులు ఇస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కొందరి అడ్రసులు ట్రేస్ అవ్వలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ పేర్లు మార్చిన నేపథ్యంలో వారికి మరోసారి నోటీసులు సర్వ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..