Andhra Pradesh: ఏపీలో ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.2.39 లక్షలు.. వచ్చే నెలలోనే ఫిక్స్.. ప్రభుత్వం నుంచి క్లారిటీ..

ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన చేశారు. ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు అందించారు. కొత్త ఇళ్లు ఎప్పుడు మంజూరు అవుతాయనే దానిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలోనే తుది జాబితా విడుదల అవుతుందని ఆయన తెలిపారు.

Andhra Pradesh: ఏపీలో ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.2.39 లక్షలు.. వచ్చే నెలలోనే ఫిక్స్.. ప్రభుత్వం నుంచి క్లారిటీ..
Andhra Pradesh

Updated on: Mar 24, 2026 | 4:31 PM

ఏపీలో ప్రభుత్వం నుంచి కొత్త ఇళ్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయోనని ఎదురుచూసేవారి నిరిక్షణకు తెరపడింది. వచ్చే నెలలో కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి రాష్ట్రంలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాతో కొంత కలిపి కూటమి సర్కార్ ఇల్లు నిర్మించుకునేవారికి ఆర్ధిక సాయం అందిస్తోంది. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. అనంతరం దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. కేంద్రం నుంచి పర్మిషన్ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ జాబితాను విడుదల చేయనుంది.

ఒక్కొక్కరికీ రూ.2.39 లక్షలు

పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం రూ.2.39 లక్షల ఆర్దిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వీటిని పరిశీలించాక 6.50 లక్షల మంది అర్హులుగా తేల్చారు. కేంద్రానికి ఈ జాబితా పంపించారు. అయితే కేంద్రం కూడా ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. అనంతరం లబ్దిదారులను గుర్తించి దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వచ్చే నెలలో లబ్దిదారుల జాబితాకు ఆమోదం తెలిపే అవకాశముందని ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారధి వివరించారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పార్థసారధి కూడా పాల్గొనగా.. పీఎం ఆవాస్ యోజన జాబితాపై చర్చించారు. అనంతరం పై విధంగా కీలక ప్రకటన చేశారు.

గ్యాస్ సరఫరాపై చర్చ

అటు రాష్ట్రంలోని ఎల్పీజీ గ్యాస్ కొరత, సరఫరాపై చంద్రబాబు చర్చించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని, ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రయత్నాలు చేయాలన్నారు. పైప్డ్ నేచురల్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్స్, ఇతర విద్యుత్ పరికరాలను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి పీఎన్‌జీ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం-కాకినాడ పైన్ లైన్ పునరుద్దరణ చేపట్టడంపై కేంద్రమంత్రికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్ విధానాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక అకాల వర్షాలపై పంట నష్టపోయిన రైతులను గుర్తించాలని, రైతు సేవా కేంద్రాల్లో జాబితాలను ప్రదర్శించాలని సూచించారు. ఈ నెల 31 నాటికి జాబితాను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.

Follow Us