Andhra Pradesh: ఓవర్‌ టు ఢిల్లీ.. జీవో1పై హైకోర్టు స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు సర్కార్

|

Jan 17, 2023 | 6:50 PM

ఓవర్‌ టు ఢిల్లీ. జీవో వన్‌ ఇష్యూ హస్తినకు చేరింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఆ జీవోపై రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.

Andhra Pradesh:  ఓవర్‌ టు ఢిల్లీ.. జీవో1పై హైకోర్టు స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు సర్కార్
AP Cm Ys Jagan Mohan Reddy
Follow us on

రోడ్లపై బహిరంగ సభల్ని నిషేధిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్‌ వన్‌ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం. ఇటీవల ఆ జీవో అమలుపై స్టే విధించింది హైకోర్టు. ఈ నెల 23వ తేదీ వరకు స్టే అమలులో ఉంటుంది ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది రాష్ట్రం. ఇటీవలి పరిణామాలు, జరిగిన దుర్ఘటనలను వివరిస్తూ రోడ్లపై బహిరంగ సభల్ని మాత్రమే నిషేధిస్తూ జీవో తెచ్చామని, హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని పిటిషన్‌ వేసింది. దీనిపై అత్యున్నత ధర్మాసనంలో విచారణ జరగాల్సి ఉంది.

మరోవైపు ప్రతిపక్షాల సభలకు వస్తున్న జనాదరణ చూసి భయపడే ప్రభుత్వం జీవో వన్‌ తెచ్చిందని విమర్శించింది టీడీపీ. అయినా సరే లోకేష్‌ పాదయాత్ర ఆగబోదన్నారు సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌.  టీడీపీ విమర్శల్ని ఖండిస్తోంది వైసీపీ. రోడ్‌షోలను, పాదయాత్రలను ఎక్కడా అడ్డుకోలేదన్నారు మంత్రి అమర్‌నాధ్‌. కేవలం రోడ్లపై సభలు మాత్రమే వద్దన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్స్‌ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..