
ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారి దురదృష్టం ఎలా ఉందంటే.. సరదాగా అలా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్నట్టుండి వారిపై విద్యుత్ తీగల తెగి పడ్డాయి. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్వల్ప గాయాలతో యువతి ప్రాణాలతో బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓబులదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, నల్లమడకు చెందిన యువతి మల్లీశ్వరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏకాంతంగా గడిపేందుకు కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతానికి ప్రేమ జంట ఆటోలో వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో యువకుడు ఫయాజ్‌కు విద్యుత్ షాక్ తో తీవ్ర గాయాలయ్యాయి. అలాగే యువతి మల్లీశ్వరి కి కూడా గాయాలయ్యాయి.
విద్యుత్ షాక్ గురవడంతో ప్రేమ జంట గట్టిగా కేకలు వేసింది. ప్రేమ జంట అరుపులు విని, గొర్రెల కాపరులు అక్కడికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్ తో గాయాలైన ఫయాజ్, యువతి మల్లీశ్వరి కనిపించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆటో డ్రైవర్ ఫయాజ్ కు తీవ్ర గాయాలు ఇవ్వడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ యువతి మల్లీశ్వరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.