Andhra Pradesh: పండక్కి ఊరెత్తున్నారా..? పోలీసుల అలెర్ట్ ఇదే.. అలా అస్సలు చేయొద్దు

గోయింట్ టూ హోమ్ టౌన్ అని ఫ్యామిలీ పిక్ పెట్టారనుకో.. మీ ఇళ్లు మొత్తం దోచేస్తారు జాగ్రత్త. ఇలాంటి విషయాల్లో కాస్త నియంత్రణ, విచక్షణ అవసరం.

Andhra Pradesh: పండక్కి ఊరెత్తున్నారా..? పోలీసుల అలెర్ట్ ఇదే.. అలా అస్సలు చేయొద్దు
Anantapur Superintendent of police Dr Kaginelli Fakeerappa

Updated on: Jan 11, 2023 | 3:57 PM

పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. దొంగలు మీ ఇళ్లను గుళ్ల చేసే అవకాశం ఉంది. దాచుకున్న నగ, నట్ర, డబ్బు దోచుకెళ్లే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే జిల్లా ప్రజలకు అనంతపురం పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ పిల్లలకు సెలవులు రావడంతో చాలా మంది సొంతూర్లకు, చుట్టాల ఇళ్లకు వెళ్లడం సర్వ సాధారణం అని.. కానీ కొన్ని జాగ్రత్తలు అవసరమన్నారు.

దొంగలు ఇదే అదనుగా భావించి చోరీలకు పాల్పడే అవకాశముందని గమనించాలన్నారు. పండుగకు ఊరికి వెళుతున్న ప్రజలు విలువైన వస్తువులు, ఆభరణాలు ఇంట్లో పెట్టుకోకూడదని… బ్యాంకుల్లో సేఫ్‌గా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే లాక్ట్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (11145 ) సేవలు వినియోగించుకోవాలన్నారు. సంక్రాంతి నేపథ్యంలో దొంగతనాల నియంత్రణకు పోలీసు పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామన్నారు జిల్లా ఎస్పీ ఫకీరప్ప.

పండుగకు ఊరెళ్లిన సమాచారం సోషియల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకుండా ఉండటమే మంచిదన్నారు.  బస్సుల్లో ప్రయాణించే వారు విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తినడానికి ఏమైనా ఇస్తే.. తిరస్కరించాలని సూచించారు. దొంగలు ఈ సమయంలో పక్కాగా స్కెచ్ వేసుకుంటారని.. అత్యంత అప్రమత్తంగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..