కరోనా బాధితుల కోసం.. మళ్లీ వైద్య వృత్తి చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే

| Edited By:

Jul 31, 2020 | 3:21 PM

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు ఏకంగా లక్ష దాటేశాయి. దీంతో ప్రభుత్వం టెస్ట్‌ల్లో వేగాన్ని మరింత పెంచింది.

కరోనా బాధితుల కోసం.. మళ్లీ వైద్య వృత్తి చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే
Follow us on

Kadiri MLA Venkatasidda Reddy turns doctor: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు ఏకంగా లక్ష దాటేశాయి. దీంతో ప్రభుత్వం టెస్ట్‌ల్లో వేగాన్ని మరింత పెంచింది. అయితే కేసులు పెరుగుతున్న క్రమంలో పలు చోట్ల వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందించడం కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో మళ్లీ డాక్టర్‌గా మారారు వైఎస్సార్‌సీపీ కదిరి ఎమ్మెల్యే పెదబల్లి వెంకట సిద్ధా రెడ్డి.

తన పాత వృత్తిని చేపట్టి తన నియోజకవర్గంలోని కరోనా బాధితులకు ఆయన చికిత్స అందిస్తున్నారు. కదిరి కరోనా ఆసుపత్రులో అక్కడి వైద్యులతో పాటు ఎమ్మెల్యే కూడా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో వైద్య సేవలు అందించేందుకు చాలా మంది భయపడుతుంటే.. వారి కోసం ఓ ఎమ్మెల్యే ముందుకొచ్చి సేవలందించడం నిజంగా అభినందించదగ్గ విషయం. అయితే ఎమ్మెల్యేగా అయిన తరువాత డాక్టర్‌గా మారడం సిద్ధా రెడ్డికి కొత్తేం కాదు. ఈ ఏప్రిల్‌లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి గాయపడగా.. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో సిద్ధా రెడ్డి అతడికి ప్రాథమిక చికిత్స చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఐఫోన్‌ ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. ఈసారి కాస్త ఆలస్యం