జూన్ రెండు కాదు.. నవంబర్ ఒకటేనట..?

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. తాజాగా ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన అనంతరం.. ఏపీ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఏపీ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం […]

జూన్ రెండు కాదు.. నవంబర్ ఒకటేనట..?

Edited By:

Updated on: Oct 18, 2019 | 8:10 AM

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. తాజాగా ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన అనంతరం.. ఏపీ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఏపీ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. కాగా, దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు కూడా ఆ విభజన తేదీ రోజునే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని తెలిపింది.

కేంద్ర హోం శాఖ చెప్పినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న గత ఐదేళ్లూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనే లేదు. అవతరణ దినోత్సవాన్ని జరపకుండా.. జూన్‌ 2న నవనిర్మాణ దీక్ష పేరుతో కోట్ల రూపాయలను ప్రచారాలకు వెచ్చించింది. ఇక నవరంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరిపేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్ల పై సీఎస్‌ ఈ నెల 21న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.