ఏపీ కేబినెట్‌‌కు ముహూర్తం ఫిక్స్..15మందికి ఛాన్స్

|

May 31, 2019 | 2:11 PM

జగన్ ప్రమాణ స్వీకారం  చేసిన మరుసటి రోజే పాలనపై దృష్టిసారించారు. జెట్ స్పీడుతో నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్రాన్ని గాడినపెడుతున్నారు. తాజాగా ఏపీ డీజీపీతో సమావేశమయ్యారు జగన్. తాడేపల్లిలోని తన నివాసంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీతో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని.. ఇందుకోసం కీలక స్థానాల్లో ఎస్పీలు పోలీసు ఉన్నతాధికారుల బదిలీపై చర్చించినట్టు తెలిసింది. మరోవైపు జగన్ కేబినెట్ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న కేబినెట్ మంత్రుల వివరాలను ప్రకటించనున్నారు. కేబినెట్‌లో […]

ఏపీ కేబినెట్‌‌కు ముహూర్తం ఫిక్స్..15మందికి ఛాన్స్
Follow us on

జగన్ ప్రమాణ స్వీకారం  చేసిన మరుసటి రోజే పాలనపై దృష్టిసారించారు. జెట్ స్పీడుతో నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్రాన్ని గాడినపెడుతున్నారు. తాజాగా ఏపీ డీజీపీతో సమావేశమయ్యారు జగన్. తాడేపల్లిలోని తన నివాసంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీతో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని.. ఇందుకోసం కీలక స్థానాల్లో ఎస్పీలు పోలీసు ఉన్నతాధికారుల బదిలీపై చర్చించినట్టు తెలిసింది.

మరోవైపు జగన్ కేబినెట్ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న కేబినెట్ మంత్రుల వివరాలను ప్రకటించనున్నారు. కేబినెట్‌లో తొలుత 15 మందికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వృద్దాప్య పింఛను పెంపుపై తొలి సంతకాన్ని పెట్టిన ఆయన.. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని ప్రకటించారు.  జూన్ 11 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.