ఏపీ రాజధాని అమరావతిపై బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆయన చేసిన కామెంట్స్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అటు ఏపీకి కొత్త రాజధానిగా దొనకొండను చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
అదేంటంటే.. విదేశాల్లో ఇలాంటి తరహా సమస్యలు వస్తే రెఫరెండం(ప్రజల అభిప్రాయం) తీసుకుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీ రాజధాని విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. చూడాలి మరి జగన్ తీసుకునే ఈ నిర్ణయానికి ప్రజల నుంచి సమాధానం ఏ విధంగా ఉంటుందో.