విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా ‘స్వాత్మానందేంద్ర సరస్వతి’!

విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమం కృష్ణానదీ తీరాన ఉన్న గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో నిర్వహించారు. ఆయన గురువైన స్వరూపానందేంద్ర సరస్వతి సన్యాస దీక్షను అనుగ్రహించారు. అయితే సన్యాస దీక్షా నామధేయంగా ‘స్వాత్మానందేంద్ర సరస్వతి’ అని నామకరణం చేశారు. సన్యాస దీక్ష స్వీకరించగానే ఉత్తరాధికారి తన గురువైన స్వరూపానందేంద్ర సరస్వతికి పాదుకాపూజతో పాటు పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలైన కె. చంద్రశేఖర్ రావు, […]

విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి’!

Updated on: Jun 17, 2019 | 7:40 PM

విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమం కృష్ణానదీ తీరాన ఉన్న గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో నిర్వహించారు. ఆయన గురువైన స్వరూపానందేంద్ర సరస్వతి సన్యాస దీక్షను అనుగ్రహించారు. అయితే సన్యాస దీక్షా నామధేయంగా ‘స్వాత్మానందేంద్ర సరస్వతి’ అని నామకరణం చేశారు. సన్యాస దీక్ష స్వీకరించగానే ఉత్తరాధికారి తన గురువైన స్వరూపానందేంద్ర సరస్వతికి పాదుకాపూజతో పాటు పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలైన కె. చంద్రశేఖర్ రావు, జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. కాగా, స్వాత్మానందేంద్ర సరస్వతికి ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కిరీటధారణ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us