ఏపీఎస్‌ఆర్టీసీలో నగదు రహిత టికెట్లు.. ఈ నెలాఖరున టెండర్లు

| Edited By:

Aug 15, 2020 | 6:55 AM

ఏపీఎస్ ఆర్టీసీలో వచ్చే ఏడాది నుంచి నగదు రహిత టికెటింగ్‌ విధానం అమలు కానుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా పనులు ప్రారంభం కాగా.. ఈ నెలాఖరున మొబైల్‌ ఆధారిత

ఏపీఎస్‌ఆర్టీసీలో నగదు రహిత టికెట్లు.. ఈ నెలాఖరున టెండర్లు
Follow us on

Cashless Ticketing APSRTC: ఏపీఎస్ ఆర్టీసీలో వచ్చే ఏడాది నుంచి నగదు రహిత టికెటింగ్‌ విధానం అమలు కానుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా పనులు ప్రారంభం కాగా.. ఈ నెలాఖరున మొబైల్‌ ఆధారిత టికెటింగ్‌కు అధికారులు టెండర్లను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించగా.. అందులో 92 సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ప్రతినిధులు  పాల్గొన్నారు. త్వరలో రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ను అధికారులు ఆహ్వానించనున్నారు. అయితే మరోవైపు నగదు రహిత టికెట్లకు సంబంధించి ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టుగా మచిలీపట్నం–అవనిగడ్డ రూట్‌లో ఆర్టీసీ అధికారులు సర్వే చేశారు. ఇందులో సానుకూల ఫలితాలు రావడంతో.. దశల వారీగా ఆర్టీసీలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

కాగా నగదు లావాదేవీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం కేవలం 39 శాతం మంది మాత్రమే ఆర్టీసీలో ఆన్‌లైన్‌లో టికెట్‌ విధానాన్ని అనుసరిస్తుండగా.. మరింత మంది ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందేలా ఆర్టీసీ ఈ ప్రయోగాన్ని చేస్తోంది. ఆర్టీసీ సిబ్బంది తమ సొంత సెల్‌ఫోన్‌తోనే టికెట్‌ జారీ, వాలిడిటేషన్‌, చెకింగ్ చేసేలా యాప్‌ అందుబాటులోకి రానుంది. ఈ విధానంపై సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి అనూహ్య స్పందన లభించినట్లుగా అధికారులు చెబుతున్నారు.

Read More:

హైదరాబాద్‌ను వీడని ముసురు

బెజవాడలో కుండపోత వర్షం