ఏపీ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌లో శిక్షణ

| Edited By:

Mar 21, 2019 | 6:02 PM

ఆంధ్రప్రదేశ్‍లోని ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌, మెకట్రానిక్స్‌ విభాగంలో శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో ఆర్జా శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మెకట్రానిక్స్‌ ప్రెసిడెంట్‌ వంగపండు వెంకట నాగరాజు, పలువురు ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈసీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 40 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు గత నవంబరులో ఒప్పం దం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‍లో పరీక్ష […]

ఏపీ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌లో శిక్షణ
Follow us on

ఆంధ్రప్రదేశ్‍లోని ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌, మెకట్రానిక్స్‌ విభాగంలో శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో ఆర్జా శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మెకట్రానిక్స్‌ ప్రెసిడెంట్‌ వంగపండు వెంకట నాగరాజు, పలువురు ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈసీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 40 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు గత నవంబరులో ఒప్పం దం కుదుర్చుకున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‍లో పరీక్ష నిర్వహించి మేలో ప్రారంభమయ్యే శిక్షణకు ఎంపిక చేస్తామని తెలిపారు.