అమరావతి:ఫ్లెక్సీ వివాదం..రెండు వర్గాల మధ్య ఘర్షణ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును ఆయన అభిమానులు, జనసైనికులు పండుగలా జరుపుకున్నారు. బర్త్ డేకు రోజుల ముందు నుంచే సెలెబ్రేషన్‌కు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తూ వచ్చారు అభిమానులు. అయితే,..

అమరావతి:ఫ్లెక్సీ వివాదం..రెండు వర్గాల మధ్య ఘర్షణ

Updated on: Sep 03, 2020 | 4:47 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును ఆయన అభిమానులు, జనసైనికులు పండుగలా జరుపుకున్నారు. బర్త్ డేకు రోజుల ముందు నుంచే సెలెబ్రేషన్‌కు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తూ వచ్చారు అభిమానులు. అయితే, పవన్ పుట్టిన రోజు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.  అమరావతి మండలం లింగాపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది.

ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టొద్దని ఓ వర్గం వాదించగా.. ఇక్కడే పెడతామని మరో వర్గం బదులిచ్చింది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. వివాదం కాస్త చినికి చినికి గాలివానగా మారింది. వివాదం ముదిరి ఇరువర్గాల మధ్య ఘర్ఫణకు దారి తీసింది. ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు. ఈ మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసిన అమరావతి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us