
ఏపీ SECగా బాధ్యతలు తీసుకున్న అనంతరం నీలం సాహ్ని గవర్నర్ హరిచందన్ ను ను మర్యాద పూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలో ZPTC, MPTC ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్ కు నీలం సాహ్ని స్పష్టం చేశారు.

గవర్నర్ తో భేటీ అనంతరం నీలం సాహ్ని CS ఆదిత్యనాధ్ దాస్ ని కలిసి పరిషత్ ఎన్నికలపై చర్చించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు ఈ ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయి కావున వెంటనే నిర్వహించాలని కోరారు. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబుతో సమీక్ష చేశారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం కలెక్టర్లు, SPలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నీలం సాహ్ని.

అటు, సీఎం జగన్ సైతం పరిషత్ ఎన్నికలపై స్పందించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది ఉందని, కొత్త SEC వచ్చారు కాబట్టి త్వరగా ఎన్నికలను నిర్వహిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.