ఆయన గెలవడమే గొప్ప: బాబుపై నాదెండ్ల భాస్కరరావు సెటైర్లు

| Edited By:

May 24, 2019 | 6:01 PM

ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం, టీడీపీకి అన్ని సీట్లు రావడం గొప్పని ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు సెటైర్లు వేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే జగన్ సీఎం అయ్యారని అన్నారు. చంద్రబాబు కులపక్షపాతిగా వ్యవహరించారన్న ప్రచారం ప్రజల్లో బాగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే జగన్ సీఎం అవుతారని తాను ముందే ఊహించానంటూ తెలిపారు. ఇక తెనాలి నుంచి పోటీ చేసిన తన కుమారుడు, జనసేన […]

ఆయన గెలవడమే గొప్ప: బాబుపై నాదెండ్ల భాస్కరరావు సెటైర్లు
Follow us on

ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం, టీడీపీకి అన్ని సీట్లు రావడం గొప్పని ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు సెటైర్లు వేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే జగన్ సీఎం అయ్యారని అన్నారు. చంద్రబాబు కులపక్షపాతిగా వ్యవహరించారన్న ప్రచారం ప్రజల్లో బాగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే జగన్ సీఎం అవుతారని తాను ముందే ఊహించానంటూ తెలిపారు. ఇక తెనాలి నుంచి పోటీ చేసిన తన కుమారుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓటమిపై గురించి అడగగా.. ఈ వేవ్‌లో అతడు కూడా కొట్టుకుపోయాడని పేర్కొన్నారు.