పాలకొల్లులో అద్భుత ద‌ృశ్యం..సమస్త రోగాలకు వివృత్తి !

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఆలయంలోని మూలవిరాట్టు...

పాలకొల్లులో అద్భుత ద‌ృశ్యం..సమస్త రోగాలకు వివృత్తి !

Updated on: Sep 06, 2020 | 12:27 PM

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఆలయంలోని మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకాయి. సూర్యకిరణాలు తాగడంతో అర్చకులు ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి విభూతి అలంకరణ చేసిన రీతిలో సూర్యకిరణాలు కనిపించడంతో స్థానికులు, భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యకిరణాలు స్వామివారిని తాకటం వల్ల సమస్త రోగాలకు నివృత్తి కలుగుతుందని అర్చకులు తెలిపారు. ప్రస్తుత మాసంలో ఇలా సూర్యకిరణాలు తాకటం అరుదుగా జరుగుతుందని, ప్రతియేటా చైత్ర్యమాసంలో అష్టామి, నవమి తిథులలో మాత్రమే సూర్యకిరణాలు పడతాయని తెలిపారు. నేడు సూర్యకిరణాలు స్వామివారిని తాకటం ఓ విశేషమని అర్చకులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us