తన ఇంట్లో చోరీపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. నిన్న రాత్రి అర్జున్ అనే వ్యక్తి తన ఇంట్లో కంప్యూటర్లు అపహరించాడని ఆయన ఆరోపించారు. కరెంట్ బాగు చేయడానికనే పేరుతో మరొకరితో కలిసి వచ్చిన అర్జున్.. కంప్యూటర్లు ఎత్తుకు వెళ్లారని ఆయన అన్నారు. గతంలో అర్జన్ తమ ఆఫీసులో పనిచేసేవాడని, ప్రస్తుతం అతడు వైసీపీ ఆఫీసులో ఉన్నాడని కోడెల అన్నారు. తమ డేటా చోరీ చేయడం వెనుక కారణాలేంటో తెలియాలని.. దీనిపై విచారణ జరగాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలను అధికార పార్టీ బతకనివ్వడం లేదని ఈ సందర్భంగా కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఫర్నీచర్ వివరాలన్నీ లేఖలో తెలియజేశానని.. ఫర్నీచర్ తిరిగి అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న కోడెల.. ఇచ్చేందుకు రెడీగా ఉన్నా వేధింపులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.