అలాంటి గాయం మరోసారి తగలకూడదు.. అందుకే: జగన్‌

ఏపీలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అలాంటి గాయం మరోసారి తగలకూడదు.. అందుకే: జగన్‌

Edited By:

Updated on: Aug 15, 2020 | 11:13 AM

Independence Day Celebrations AP: ఏపీలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. సమానత్వం అన్న పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్న ఆయన.. ఎస్పీ, బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఇక రాష్ట్ర విభజన తరువాత అయిన గాయాలు మానిపోవాలన్నా, అలాంటి గాయం మరోసారి తగలకుండా జాగ్రత్తపడాలన్నా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని జగన్ అన్నారు. ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణే సరైన విధానం అని నిర్ణయించి, మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని తెలిపారు. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూల్ కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తామని వివరించారు. రాష్ట్రంలోని పేదరికాన్ని రూపుమాపేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు.

Read More:

Good Luck  Sakhi Teaser:మన రాతను మనమే రాసుకోవాలా

ఈడీ స్టేట్‌మెంట్‌పై అంకితా క్లారిటీ.. రీట్వీట్ చేసిన సుశాంత్ సోదరి