ఆనంపై జగన్ సీరియస్.. వేటు తప్పదా..?

| Edited By:

Dec 07, 2019 | 10:00 PM

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజు నోటీసులు ఇవ్వాలని ఎంపీ విజయ‌సాయి రెడ్డికి సూచించారు జగన్.. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదరిస్తే వేటు తప్పదని స్ట్రాంగ్ ఆదేశాలు ఇచ్చారు. ఇకపై పార్టీ గీత దాటి మాట్లాడొద్దని వెంటనే ఆనంకు చెప్పాలని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురాకుండా ప్రెస్‌మీట్ పెట్టడాన్ని ఈ సందర్భంగా జగన్ తప్పుపట్టినట్లు […]

ఆనంపై జగన్ సీరియస్.. వేటు తప్పదా..?
Follow us on

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజు నోటీసులు ఇవ్వాలని ఎంపీ విజయ‌సాయి రెడ్డికి సూచించారు జగన్.. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదరిస్తే వేటు తప్పదని స్ట్రాంగ్ ఆదేశాలు ఇచ్చారు. ఇకపై పార్టీ గీత దాటి మాట్లాడొద్దని వెంటనే ఆనంకు చెప్పాలని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురాకుండా ప్రెస్‌మీట్ పెట్టడాన్ని ఈ సందర్భంగా జగన్ తప్పుపట్టినట్లు సమాచారం.

కాగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆనం రామనారాయణ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా మాఫియాలకు అడ్డాగా మారిందని.. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాంత్.. ఇలా ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుకుతుందని ఘాటు కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు పరోక్షంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఉద్దేశించి అన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్ సీరియస్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.