అమరావతిపై కీలక ప్రకటన చేయనున్న సీఎం జగన్.. ఎప్పుడంటే?

రాజధాని నగరం, అమరావతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాజధానిలోని 29 గ్రామాలు పంచాయతీలుగానే మిగిలిపోతాయా అనే దానిపై క్లారిటీ లేదు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని గ్రామాల భవిష్యత్తుపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో కీలక […]

అమరావతిపై కీలక ప్రకటన చేయనున్న సీఎం జగన్.. ఎప్పుడంటే?

Edited By:

Updated on: Dec 01, 2019 | 11:55 PM

రాజధాని నగరం, అమరావతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాజధానిలోని 29 గ్రామాలు పంచాయతీలుగానే మిగిలిపోతాయా అనే దానిపై క్లారిటీ లేదు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని గ్రామాల భవిష్యత్తుపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

వైయస్ జగన్ సీఎం అయ్యాక రాజధానిపై కొంత స్తబ్దత ఏర్పడింది. అయితే, సిఆర్‌డిఎలో జరిగిన సిఎండిఎ క్రెడా సమావేశంలో తాజా ప్రకటన రైతుల్లో ఆశలు రేకెత్తించింది. మునిసిపాలిటీలు మరియు పంచాయతీలకు భూమి విలువలో కూడా తేడా ఉంది. అయితే, మునిసిపాలిటీలకు  తగిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది.