కన్నబాబుకి భద్రత పెంపు

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ఏపీ ఇంటిలిజెన్స్ సూచనల మేరకు భద్రతను పెంచారు. ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని నిఘా వర్గాలు ఇటీవల కన్నబాబుకి సూచించాయి.

కన్నబాబుకి భద్రత పెంపు

Updated on: Sep 04, 2020 | 3:53 PM

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ఏపీ ఇంటిలిజెన్స్ సూచనల మేరకు భద్రతను పెంచారు. ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని నిఘా వర్గాలు ఇటీవల కన్నబాబుకి సూచించాయి. అన్ని వేళలా పలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పేర్కొన్నాయి. దీంతో కన్నబాబుకు హోం శాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. తన తాజా పర్యటనలకోసం కొత్తగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే కన్నబాబు వినియోగిస్తున్నారు. ఇంటెలిజెన్స్ శాఖ నివేదికతో హోంశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు కన్నబాబుకి కల్పించిన భద్రతలోనూ పలు మార్పులు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us