Andhra Pradesh New Map: అమరావతికి చట్టబద్దత తర్వాత కీలక పరిణామం.. ఏపీ కొత్త మ్యాప్‌ ఇదిగో..

ఇక చూస్తారుగా ఈ కూటమి ప్రభుత్వం ఆడే అభివృద్ధి ఆట అని... రాజధానికి చట్టబద్ధత తర్వాత అధికారపక్షం నుంచి డైలాగులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే ముందుకెళ్తున్న ప్రభుత్వం... క్యాపిటల్‌తో కూడిన ఏపీ నయా మ్యాప్‌ని రిలీజ్ చేసింది. 28 జిల్లాలతో కూడిన మ్యాప్ ను విడుదల చేసింది.

Andhra Pradesh New Map: అమరావతికి చట్టబద్దత తర్వాత కీలక పరిణామం.. ఏపీ కొత్త మ్యాప్‌ ఇదిగో..
Ap New State Map

Updated on: Apr 05, 2026 | 8:01 AM

అమరావతికి చట్టబద్దత తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్…! ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అంటూ… కొత్తగా ఏర్పడ్డ జిల్లాలతో కలుపుకుని 28 జిల్లాలతో కూడిన ఏపీ రాష్ట్ర నయా మ్యాప్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దులో నిర్మితమవుతున్న రాజధానిని మ్యాప్‌లో స్పష్టంగా చూపించింది.  పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను… పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పోలవరం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసింది. ఇప్పుడా రెండు జిల్లాలను కొత్త మ్యాప్‌లో చూపించారు. ముఖ్యంగా రాజధాని విషయంలో కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, అధికారిక మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా చేర్చడం కీలక పరిణామం.

Andhra Pradesh New Map

రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఏపీ ఏర్పాటైంది. వైఎస్‌ జగన్‌ హయాంలో అది 26 జిల్లాలుగా మారింది. ఇక చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను చేర్చడంతో మొత్తం 28 జిల్లాల ఏపీగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఇలాంటి కీలక పరిణామాలు చోటు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us