రాళ్ళతో, చెప్పులతో కొట్టే రోజు త్వరలోనే వస్తుంది : ఏపీ మంత్రులు

అమరావతి రాజధాని వ్యవహారంలో జరిగిన అవినీతి, అక్రమాలు వెలికి వస్తాయన్న భయంతో టీడీపీ అధినేతకు నిద్రపట్టడంలేదని ఏపీ మంత్రులు విమర్శించారు. దీనిపై ఏసీబీ విచారణ ఎదుర్కోలేక చంద్రబాబునాయుడు...

రాళ్ళతో, చెప్పులతో కొట్టే రోజు త్వరలోనే వస్తుంది : ఏపీ మంత్రులు

Updated on: Sep 17, 2020 | 3:37 PM

అమరావతి రాజధాని వ్యవహారంలో జరిగిన అవినీతి, అక్రమాలు వెలికి వస్తాయన్న భయంతో టీడీపీ అధినేతకు నిద్రపట్టడంలేదని ఏపీ మంత్రులు విమర్శించారు. దీనిపై ఏసీబీ విచారణ ఎదుర్కోలేక చంద్రబాబునాయుడు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. హిందూత్వ పేరుతో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ కుట్రలను ప్రజలే తిప్పికొడతారని, వారిని రాళ్ళతో, చెప్పులతో కొట్టే రోజు వస్తుందని మంత్రులు చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, బాలినేని శ్రీనువాసులురెడ్డి శాపనార్థలు పెట్టారు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే అక్కడ కూడా కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేపడుతున్న సంక్షేమ పధకాలను చూసి ఓర్వేలేక తెలుగుదేశం నేతలు వైసీపీ ప్రభుత్వంపై మతం పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ చేస్తున్న మంచి కార్యక్రమాలకు భయపడి దేవాలయాల్లో రథాలు దగ్ధం, విగ్రహాలు ధ్వంసం వంటి కుట్రలకు టీడీపీ నేతలే పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us