ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదు.. ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి

ప్రాణ హాని ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. ఏపీలో ఎవరికి భద్రత కావాలన్నా తమ ప్రభుత్వం కల్పిస్తుందని స్పష్టం చేశారు...

ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదు.. ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి
Sri Ranganatha Raju

Updated on: Jun 22, 2020 | 4:41 PM

ప్రాణ హాని ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. ఏపీలో ఎవరికి భద్రత కావాలన్నా తమ ప్రభుత్వం కల్పిస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం సహకారం అందజేస్తామని తెలిపారు. 15 లక్షల మంది ప్రజలకు ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా తగిన భద్రత ఏర్పాటు చేస్తామని, గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. ప్రాణహాని ఉందంటున్న ఎంపీ, ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదన్న విషయం గుర్తించాలని మంత్రి  అన్నారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోన్న విషయం తెలిసిందే. తన పార్లమెంటు స్థానం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో రఘురామకృష్ణంరాజు సంబంధాలు దెబ్బతిన్నట్టు ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us