తొలి జీవో జారీ చేసిన జగన్ సర్కార్

|

May 31, 2019 | 2:29 PM

ఆంధ్రప్రదేశ్  రెండో సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం వృద్ధాప్య పింఛన్లపై చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా దానికి సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేరు మార్చి.. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 2250 రూపాయలకు పెన్షన్ జూన్ నుంచి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జులై 1 నుండి కొత్త పెన్షన్ […]

తొలి జీవో జారీ చేసిన జగన్ సర్కార్
Follow us on

ఆంధ్రప్రదేశ్  రెండో సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం వృద్ధాప్య పింఛన్లపై చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా దానికి సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేరు మార్చి.. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 2250 రూపాయలకు పెన్షన్ జూన్ నుంచి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జులై 1 నుండి కొత్త పెన్షన్ పథకం అమలుకానుంది. వికలాంగులకు రూ. 3000, కిడ్నీ బాధితులకు రూ. 10000 పెన్షన్ అందనుంది. వృద్ధులకు పెన్షన్ వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కుదించారు. కాగా ప్రమాణ స్వీకార సభలో పెన్షన్ ప్రతీ ఏడాది రూ. 250 పెంచుతానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.