పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు.. జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో జగన్‌‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా వాటిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని

పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు.. జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Government: రాష్ట్రంలో వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో జగన్‌‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా వాటిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల తనిఖీ కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ కలిగిన పరిశ్రమలు ఇలా అన్నింటినీ తనిఖీ చేయాలని అందులో పేర్కొంది. ఉత్తర్వుల ప్రకారం ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఉండనుండగా.. మరో ఆరుగురు సభ్యులుగా ఉండనున్నారు. వీరు ప్రతీ పరిశ్రమను పరిశీలించడమే ప్రధాన ఉద్దేశమని, ఇక పరిశ్రమల్లో ఏవైనా లోపాలు ఉంటే 30 రోజుల లోపే వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాల్లో వివరించింది.  90 రోజుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Read This Story Also: సుశాంత్ కేసు: ముంబయిపై మాజీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు

Click on your DTH Provider to Add TV9 Telugu