Amaravathi @400 Days: ఏపీకి మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు… నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భూములిచ్చిన ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ఆందోళన బుధవారం నాటికి 400వ రోజులకు చేరుకుంది. రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే తమ భూములిచ్చామని.. ఇప్పుడు రాజధానిని మారిస్తే.. తమకు న్యాయం జరగదంటూ.. ఆ ప్రాంత రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. నేటితో అమరావతి కోసం చేస్తున్న ఆందోళనలు నేటితో 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని గ్రామాల్లో రైతులు బైక్, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఈ ర్యాలీ తుళ్లూరు గ్రామం నుంచి ప్రారంభమై పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజు పాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి మీదుగా మందడం వరకు సాగనుంది. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు తాము ఆందోళనలు విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ తాము ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణతో కాదని.. పరిపాలనతో జరగాలని అంటున్నారు.
Also Read: ఎన్నికలు సమీపిస్తున్నవేళ బెంగాల్ లో పొలిటికల్ హీట్, టీఎంసీ ఆఫీస్ పై దాడి, ఇద్దరు మృతి