Andhra Pradesh: యువకుడిని లోబరుచుకుని.. నగ్న వీడియోలు తీసి బెదిరింపులు.. చివరకు ఏం జరిగిందంటే

మాయమాటలతో నమ్మించింది. చాలా అందంగా ఉన్నావంటూ కవ్వించింది. ఎవరూ లేని ఏకాంత సమయంలో యువకుడిని లోబరుచుకుంది. ఇలా చాలా సార్లు చేసిన తర్వాత అతని నగ్న వీడియోలు కావాలని అడిగింది...

Andhra Pradesh: యువకుడిని లోబరుచుకుని.. నగ్న వీడియోలు తీసి బెదిరింపులు.. చివరకు ఏం జరిగిందంటే
Man Harassment

Updated on: Sep 19, 2022 | 4:57 PM

మాయమాటలతో నమ్మించింది. చాలా అందంగా ఉన్నావంటూ కవ్వించింది. ఎవరూ లేని ఏకాంత సమయంలో యువకుడిని లోబరుచుకుంది. ఇలా చాలా సార్లు చేసిన తర్వాత అతని నగ్న వీడియోలు కావాలని అడిగింది. ఆమె మాటలు నమ్మిన యువుకుడు అలాగే చేశాడు. వాటి ఆధారంగా సదరు మహిళ వేధింపులకు పాల్పడింది. డబ్బులు కావాలని వేధించింది. ఆమె వేధింపులు ఎక్కువ అవడంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఓ యువకుడు బీబీఏ చదువుతున్నారు. అతను ఓ ఆపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. రోజూ కాలేజీకి వెళ్లే అతనినికి ఓ రోజు గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ వచ్చింది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె యువకుడితో చనువుగా ఉంటూ అతనితో సాన్నిహత్యం పెంచుకుంది. మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. ఇలా వీరిద్దరూ మాట్లాడుకోవడం, కలుసుకోవడం నిత్యం జరిగేవి. ఈ క్రమంలో సదరు మహిళ యువకుడి నగ్న వీడియోలు తీసి పంపాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన ఆ యువకుడు తన నగ్న వీడియోలు తీసి, ఆమెకు పంపించాడు.

అప్పుడే ఆమెలోని మరో కోణం బయటపడింది. న్యూడ్ వీడియోలను ఆధారంగా చేసుకుని సదరు మహిళ యువకుడిని బెదిరించేది. నగదు పంపాలని, లేకుంటే వీడియోలను బయట పెడతానంటూ భయపెట్టింది. వేరే మార్గం లేని పరిస్థితుల్లో యువకుడు ఆమె చెప్పినట్లే చేశాడు. రూ. 8 వేలు పంపాడు. ఇవి సరిపోవని, ఇంకా కావాలని బెదిరిస్తుండటంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశాడు. యువకుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us