AP News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఇంట్లోళ్లు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో.. చివరికి ఏం చేసిందంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరి మధ్య  ఏర్పడిన స్నేహం  కాస్త ప్రేమగా మారింది. ప్రేమికుడి కోసం ఆ యువతీ పరితపించింది. ప్రియుడి చెంతకు చేరేందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు విశ్వప్రయత్నాలు అన్ని చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో చివరికి కాలువలో దూకేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

AP News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఇంట్లోళ్లు ఎంతకీ ఒప్పుకోకపోవడంతో.. చివరికి ఏం చేసిందంటే?
A Woman Jumped Into Canal Due To Instagram Love In Vijayawada
Follow us
M Sivakumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 29, 2024 | 5:18 PM

కలిసి బతకాలని ఎంతో ఊహించుకున్న ఆ యువతికి తన ప్రయాణంలో విషాదం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరి మధ్య  ఏర్పడిన స్నేహం  కాస్త ప్రేమగా మారింది. ప్రేమికుడి కోసం ఆ యువతీ పరితపించింది. ప్రియుడి చెంతకు చేరేందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు విశ్వప్రయత్నాలు అన్ని చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో చివరికి కాలువలో దూకేసింది. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది.

విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి (19) ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. తరువాత ఇంటి వద్దనే ఉంటూ పనులు చేసుకుంటుంది . ఈ తరుణంలో  ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యువతికి  పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.  ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 24న ఆ యువతి డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగేసింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. హుటాహుటిన స్పందించిన వైద్యాధికారులు ఆమెను ప్రాణాలతో రక్షించారు.

చికిత్స అనంతరం ఆ యువతిని హాస్పటల్ నుంచి డీఛార్జ్ చేశారు. తల్లిదండ్రులు యువతిని  ఇంటికి తీసుకురాగా, 25వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి మిస్సింగ్ అయ్యింది. యువతీ ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులకు  తునిలో ఉన్నట్లు తెలిసింది. ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు 26వ తేదీ రాత్రి అందరూ నిద్రలో ఉండగా మళ్లీ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బస్టాండ్, రైల్వేస్టేషన్తో పలు ప్రాంతాల్లో వెతికారు. అనంతరం 27 తేదీ(బుధవారం) మధ్యాహ్నం సమయంలో యువతి తండ్రికి పాండు అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన మీ కుమార్తె పాత పోలీస్‌ కంట్రోల్‌ రూం సమీపంలో ఉన్న పైవంతెన నుంచి రైవస్‌ కాలువలోకి దూకినట్లు సమాచారం అందించాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకొని యువతి కోసం ఎంత గాలించిన కనిపించలేదు. దీంతో గవర్నర్‌పేట పోలీసులను యువతి తల్లిదండ్రులు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి