Viral News: నకిలీ కరెన్సీ నోట్ల కలకలం.. చిల్లర ఇవ్వమని అడిగి దొంగనోట్ల మార్పిడి.. ఎక్కడంటే..

|

Sep 25, 2022 | 11:29 AM

నకిలీ నోట్ల ఆగడాలను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక మూలనుంచి నకిలీ నోట్ల దందా కొనసాగుతూనే ఉంది. కొత్త నోట్లు వచ్చిన తర్వాత నకిలీ నోట్ల మార్పిడి తగ్గినట్లు కన్పించినా.. ఇటీవల మళ్లీ మార్కెట్లో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా..

Viral News: నకిలీ కరెన్సీ నోట్ల కలకలం.. చిల్లర ఇవ్వమని అడిగి దొంగనోట్ల మార్పిడి.. ఎక్కడంటే..
Fake Currency
Follow us on

Andhra Pradesh: నకిలీ నోట్ల ఆగడాలను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక మూలనుంచి నకిలీ నోట్ల దందా కొనసాగుతూనే ఉంది. కొత్త నోట్లు వచ్చిన తర్వాత నకిలీ నోట్ల మార్పిడి తగ్గినట్లు కన్పించినా.. ఇటీవల మళ్లీ మార్కెట్లో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. పెద్దాపురం పట్టణం పరిధిలోని రెండో వార్డు పరిధిలో కూరగాయల వ్యాపారం చేస్తున్న జంపన వెంకటరావు దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు నకిలీ నోట్లను మార్చారు. రూ.200 నోట్లు తీసుకొచ్చి చిల్లర అడిగి తీసుకుని జారుకున్నాడు. తర్వాత ఆనోట్లు నకిలీవని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు కూరగాయల వ్యాపారి జంపన వెంకటరావు. ఓ గుర్తు తెలియని వ్యక్తి కూరగాయల దుకాణం వద్దకు వచ్చి.. తాను తాపీమేస్త్రీని అని, కూలీలకు ఇచ్చేందుకు చిల్లర అవసరమని చెప్పి.. రూ.200 నోట్లు ఇచ్చి చిల్లర తీసుకున్నాడు. ఆగుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నిజమని నమ్మిన వెంకటరావు నకిలీ రూ.200 నోట్లు తీసుకుని చిల్లర ఇచ్చాడు. ఈవిషయం ఆనోట ఈనోట తెలియడంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నకిలీ నోట్ల వ్యవహరంపై కూపీ లాగుతున్నారు.

నకిలీ కరెన్సీ నోట్లు మార్చిన వ్యక్తి ఏప్రాంతానికి చెందిన వాడు. కేవలం ఆ ఒక్క దుకాణం దగ్గరే నోట్లు మార్చాడా లేదా ఇంకా పెద్దాపురం పట్టణంలో గాని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నోట్లు మార్చాడా అనే విషయంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇటీవల కాలంలో నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి ఎక్కవుగా జరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు అసలు నోటు మాదిరిగానే నకిలీ నోట్లను తీసుకొచ్చి దుకాణాల్లో సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. తక్కవ మొత్తంలో కావడంతో వ్యాపారులు కూడా పట్టుపట్టి చూడకుండా నోట్లు తీసుకుంటున్నారు. ఆతర్వాత అది నకిలీ నోట్లు అని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..