Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..

పక్షుల గూటిలో పక్షులు ఉండటం కామన్.. కానీ ఒక పెద్ద పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే భయమవుతుందా.. కానీ తిరుమలలో నిజంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పక్షుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన గూటిలోకి ఏకంగా 9 అడుగుల భారీ జెర్రిపోతు చొరబడటంతో భక్తులు భయాందోళన చెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..
Snake Found In Bird Nest At Tirumala

Edited By:

Updated on: Jul 26, 2026 | 7:27 AM

జీవవైవిధ్యానికి నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్నో రకాల జీవరాశులు నివసిస్తుంటాయి. దట్టమైన చెట్లు, కొండలు, లోయలతో నిండి ఉండే ఈ అడవి ఎన్నో రకాల వింతలు, విశేషాలతో పాటు అనేక అరుదైన జీవరాశులకు అత్యంత సురక్షితమైన ఆవాసంగా నిలుస్తుంది. అయితే ఏడుకొండలవాడు కొలువైన ఈ పవిత్ర క్షేత్రంలో ఇటీవల కాలంలో వన్యప్రాణులు, విషసర్పాల సంచారం క్రమంగా పెరుగుతుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆదిశేషుడినే తన వాహనంగా చేసుకుని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు అభయమిచ్చే ఆ మలయప్ప స్వామి కొలువైన తిరుమల గిరుల్లో పాములు తరచూ కనిపిస్తూ భక్తులను భయపెడుతున్నాయి. అడవుల్లో ఉండాల్సిన విషసర్పాలు, భారీ కొండచిలువలు, జెర్రిపోతులు ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి.

పక్షుల గూటిలో 9 అడుగుల పాము

ఈ క్రమంలో తిరుమలలోని శిలాతోరణం ప్రాంగణంలో ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, పక్షుల కోసం టీటీడీ అటవీ శాఖ ఆ ప్రాంతంలో కొన్ని ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేసింది. అయితే అందులోని ఒక గూటిలోకి ఏకంగా ఒక భారీ జెర్రిపోతు ప్రవేశించింది. దాదాపు 9 అడుగుల పొడవు ఉన్న ఆ జెర్రిపోతు గూటిలో చుట్టుకుని ఉండటాన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. విషయం తెలిసిన వెంటనే టీటీడీ అటవీ విభాగానికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకుని..చాకచక్యంగా ఆ 9 అడుగుల భారీ జెర్రిపోతును బంధించారు. అనంతరం ఆ పాముకు ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అక్కడున్న భక్తులు, స్థానికులు, టీటీడీ సిబ్బంది అందరూ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us