Andhra Pradesh: పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం..  17మందికి తీవ్ర అస్వస్థత

కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం సేవించి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను

Andhra Pradesh: పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం..  17మందికి తీవ్ర అస్వస్థత
Food Poison

Updated on: Aug 21, 2022 | 8:55 AM

Andhra Pradesh: పెళ్లిలో కలుషిత ఆహారం తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం సేవించి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను మండపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ సమాచారం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రియాంక వాహిని తెలిపారు. వివాహ వేడుకలో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమేమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us