బ్రేకింగ్: ఇసుకపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇసుకపై ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానంలో భాగంగా.. ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసింది. ఈ మేరకు గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కిలోమీటర్ ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేసింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక కొత్త రవాణా టెండర్లకు సంబంధించి జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులు దరఖాస్తు […]

బ్రేకింగ్: ఇసుకపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2019 | 9:01 AM

ఇసుకపై ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానంలో భాగంగా.. ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసింది. ఈ మేరకు గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కిలోమీటర్ ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేసింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక కొత్త రవాణా టెండర్లకు సంబంధించి జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులు దరఖాస్తు చేసుకుంటే వారికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. కాగా కొత్త రవాణా టెండర్ల ప్రకారం… ఇసుక తరలింపులో. కిలోమీటర్‌కి రూ.4.90 ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఇసుక రేట్లు అమాంతం పెరగడంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేత చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో ఇసుకపై కృత్రిమ కొరత సృష్టిస్తే చూస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు ఇసుక కొరతపై టీడీపీ పిలుపుతో శుక్రవారం ఆ పార్టీ నాయకులు ఆందోళన చేయడం, వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగాయి. ఇక ఆ తరువాత కొన్ని గంటల్లోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనర్హం. కాగా దీన్ని బట్టి చూస్తేంటే ప్రభుత్వం ఇసుక విధానం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదని స్పష్టంగా అర్థమవుతోంది.