ఆమెలా నేనెందుకు ఉండాలి..! ఆమెనే నాలా ఉండమనండి: అనసూయ

Anchor Anasuya Bharadwaj Sensational Comments on Anchor Suma

ఈ మధ్య హాట్ హాట్ ఫొటోలతో కాకరేపుతోంది.. యాంకర్ అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే.. ఇది ఇప్పుడు అనసూయకు చిక్కైంది. ఆమె లేటెస్ట్ హాట్ హాట్ ఫొటోస్‌పై ట్రోలింగ్ మొదలైంది. నెటిజెన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్స్‌పై యాంకర్ అనసూయ.. నెటిజెన్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది.

‘ఒకప్పుడు ఈ కామెంట్స్ గురించి ఆలోచించి బాధపడ్డా.. కానీ.. ఇప్పుడు అస్సలు పట్టించుకోను.. ఎందుకంటే.. నాబట్టలు నా ఇష్టం.. నన్ను అలా ఉండు.. ఇలా ఉండని.. జడ్జ్ చేయడానికి మీకు హక్కు లేదని’ కుండ బద్దలు కొట్టినట్టు నెటిజెన్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంలోకి సన్సేషనల్ యాంకర్ సుమ, ఝాన్సీల పేర్లు కూడా వినిపించాయి.

యాంకర్ సుమ, ఝాన్సీ గార్లంటే నాకు చాలా ఇష్టం.. వాళ్ల అనుభవం ముందు నేను ఎంత చేసినా.. తక్కువేనని.. నేను ఎంత ఎదిగినా తక్కువగానే ఉంటానని అన్నారు. ఇక నా యంకరింగ్ విషయానికి కొస్తే.. మేమేందరం ఒకే ఫ్రొఫెషన్‌కి చెందినవాళ్లం.. వాళ్ల కంఫర్ట్ జోన్‌‌లో వాళ్లున్నారు. నా కంఫర్ట్‌ జోన్‌లో నేను ఉన్నానని తెలిపింది. నాకు లేని బాధ మీకెందుకు..? వాళ్ల లాగ ఉండొచ్చుగా.. వీళ్లలాగా ఉండొచ్చుగా అనే చెత్త ఐడియాలకు నాకు ఇవ్వకండి.. అయినా.. సుమ లాగ నేనెందుకు ఉండాలి.. సుమనే నాలాగ ఉండొచ్చుగా.. నేను ప్రెజెంట్ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నా.. అంటూ.. ఘాటుగా స్పందించింది యాంకర్ అనసూయ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *