ఆకట్టుకుంటోన్న ‘దొరసాని’ టీజర్..!

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను రామానాయుడు జయంతిని పురస్కరించుకుని ఇవాళ విడుదల చేశారు.

దొరసాని దర్శనమే మహాభాగ్యం అనుకునే రాజుగాడికి దొరసాని ప్రేమ దక్కితే, ఆ ప్రేమ వల్ల రాజుగాడి జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి..? చివరికి వీళ్లిద్దరి ప్రేమ గెలిచిందా.? అనేది ఈ సినిమా నేపధ్యం. ఈ సినిమాకి నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *