Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

అమిత్ షా ఇక కేంద్ర మంత్రి ?

Amith Shah, అమిత్ షా ఇక కేంద్ర మంత్రి ?

రెండో సారి ప్రధానిగా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్న మోదీ మెల్లగా తన రాజకీయ చాతుర్యాన్ని చూపడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు తనకు కుడి భుజంగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా బీజేపీని విజయపథాన నడిపించిన అమిత్ షాను తన కొత్త మంత్రివర్గంలో చేర్చుకునే సూచనలు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి గురువారం ఉదయమే వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షాను కొనసాగించాలని ఆర్ ఎస్ ఎస్ సూచించినప్పటికీ మోదీ ఆ సూచనను పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో కూడా అమిత్ షా తనకు చేదోడువాదోడుగా ఉంటారని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలని మోదీ ఓ నిర్ణయానికి వఛ్చినట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే అమిత్ షా ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉండవచ్చు. అటు.అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి అత్యంత ప్రాధాన్యం గల బెర్తు దక్కవచ్ఛునని తెలుస్తోంది.కాగా-బాబుల్ సుప్రియో, రాజ్ నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్ వంటి పాత వారితో బాటు కిషన్ రెడ్డి లాంటి కొత్తవారిని కూడా మోదీ తన కేబినెట్లోకి తీసుకోవడం విశేషం.