ట్రంప్‌పై విష ప్రయోగం కేసులో మహిళ అరెస్ట్

|

Sep 22, 2020 | 12:45 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విష ప్రయోగం కేసును యూఎస్ పోలీసులు ఛేదించారు. ట్రంప్ ను హతమార్చేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

ట్రంప్‌పై విష ప్రయోగం కేసులో మహిళ అరెస్ట్
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విష ప్రయోగం కేసును యూఎస్ పోలీసులు ఛేదించారు. ట్రంప్ ను హతమార్చేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్‌-కెనడా సరిహద్దుల్లో ఆమెను అదుపులోకితీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వైట్ హౌజ్ లోని ట్రంప్‌నకు చేరేలా విరుగుడు లేని విషం వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన అమెరికా పోలీసులు ఆ పార్శిల్‌ కెనడా నుంచి వచ్చినట్లు గుర్తించారు. దాని ఆధారంగా జరిపిన దర్యాప్తులో ఓ మహిళే నిందితురాలని తేలినట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు మాత్రం వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించబయటకు వెల్లడించలేదు. రెండు రోజుల క్రితం ‘రైసిన్‌’ అనే విషం ఉన్న ఓ పార్శిల్‌ను అధ్యక్ష భవనానికి చేరకముందే పోలీసులు పరీక్షించి అడ్డుకున్నారు. ఆ పార్శిల్‌ను ఎవరు పంపించారో గుర్తించేందుకుగానూ ఎఫ్‌బీఐ, సీక్రెట్‌ సర్వీస్‌, అమెరికా పోస్టల్‌ తనిఖీ సేవల విభాగం దర్యాప్తు చేశాయి.